అక్టోబర్ 2న తెనాలిలో జంతువధ నిషేధం: మున్సిపల్ కమిషనర్

82பார்த்தது
అక్టోబర్ 2న తెనాలిలో జంతువధ నిషేధం: మున్సిపల్ కమిషనర్
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న తెనాలి పట్టణంలో జంతువధపై నిషేధం విధించినట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసం, చేపలు అమ్మకందారులు దుకాణాలు, కబేళా మూసివేయాలన్నారు. అల్పాహారశాలలు, రెస్టారెంట్లలో మాంసాహార పదార్థాలు తయారు చేయవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி