నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ కు ఎవరైనా అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ లోకనాథం అన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఓ దుకాణం వద్ద రోడ్డు మీద బాస్కెట్లు పెట్టడంతో మంగళవారం సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని వివిధ షాపులు, వ్యాపార సంస్థల యాజమాన్యాలకు సీఐ హెచ్చరించారు.