వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు భారీ వర్షాలతో అవస్థలు పడుతున్న ప్రజలకు.. డయేరియా పెను ముప్పుగా మారింది. కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరోచనాలతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో వందల మంది డయేరియా బారిన పడి చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోయారు.