వరద బాధితుల సహాయం కోసం లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కోనేరు అనీల్ బోస్ ఆయన కుటుంబంతో కలిసి.. శుక్రవారం విజయవాడలో మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. వరద బాధితులకు వీరు చేస్తున్న సహాయాన్ని లోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ ఉన్నారు.