ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి దేవస్థానంలో.. 13 మంది పొరుగు సేవల ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల తరహాలో ఖాతాల ద్వారా జీతాలు అందిస్తున్నారని గ్రామానికి చెందిన ఆర్వీ కోటయ్య మంగళవారం దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. 2023లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. 20 మందిని పొరుగు సేవల కింద దినసరి జీతభత్యం ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయన్నారు.