ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబర్ 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆమోదంతో అధికారిక ప్రకటన రానుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదన కొత్త విలువలను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల తీరుపై రెండున్నర నెలల నుంచి రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది.