AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ-విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది.