వింజమూరు మండల కేంద్రంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ నందు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గరుండి పరిశీలించి నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేయుచున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.