సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరు సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంచల బాబు యాదవ్ కోరారు. శనివారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సభ్యత్వం అనేది టిడిపి కార్యకర్తలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని స్వయంగా చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీ అన్నారు.