నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ పరిధిలో మద్యం షాపులు కొరకు 115 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ తన్నీరు లక్ష్మణ్ స్వామి గురువారం తెలిపారు. ఉదయగిరి మండలంలో 3 షాపులకు గాను 17, సీతారాంపురం మండలంలో 2 షాపులకు గాను 17, దుత్తలూరు మండలంలో 2 షాపులకు గాను 41, మర్రిపాడులో 5 షాపులకు గాను 40 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం 7 గంటల లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.