నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు నగరంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్- 9440817468 విద్యుత్ వినియోగదారులు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నామన్నారు.