నెల్లూరు డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కమిటీలను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో కొన్ని సిఫారసులు చేసినట్లు సమాచారం.