నెల్లూరు డిఆర్ఓ లవన్న బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో పశ్చిమగోదావరి డిఆర్ఓగా ఉన్న ఉదయభాస్కర్ బదిలీపై నెల్లూరు లో సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఆయన సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రెవెన్యూ పరిపాలన నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.