ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. అలాగే కావలికి చెందిన తాటిపర్తి శ్రీనివాసులును డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 15 మంది సభ్యులను నియమించగా జిల్లాకు చెందిన ఇద్దరికీ ఈ పదవులు లభించాయి. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.