నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ ఖాళీ స్థలాలలో పార్కులను నిర్మించనున్నామని, వాటి నిర్వహణకై స్థానిక కమిటీలు లేదా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకునేలా భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు.