నెల్లూరు: జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గురుకుల బుధవారం స్టోన్ హౌస్ పేటలోని పప్పులు వీధి పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్కును అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగకరమైన వాతావరణం కలుగుతుందని చెప్పారు. పార్కులో డ్రైనేజీ సమస్య, లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అభివృద్ధి కోసం మంత్రి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామని తెలిపారు.