డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు నగరంలోని విఆర్సి గ్రౌండ్స్‌లో 500 మంది క్రిస్మస్ క్వయర్‌తో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్టు పాస్టర్లు డి. వినోద్ ప్రకాష్, దివాకర్ రామకృష్ణ తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్‌లో పోస్టర్లు ఆవిష్కరించిన వారు, ఈ కార్యక్రమానికి నెల్లూరు పీఠాధిపతులు మోస్ట్. రెవా. డాక్టర్ డి. ప్రకాశం, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.