బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ ఆలయంలో అక్టోబరు 9, 10 తేదీల్లో కాళరాత్రి పూజలు, 11న నిత్యాన్నదానంలోకి భక్తులను అనుమతించకుండా పంపివేశారంటూ ఓ వ్యక్తి లోకాయుక్త ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవదా యశాఖ కమిషనర్ ఆదేశాలతో ఆదివారం పెంచలకోన నరసింహస్వామి ఆలయ డీసీ, ఈవో పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జొన్నవాడ ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డిని విచారించారు. వాస్తవాలపై ఆరా తీశారు.