అల్లూరు మండలంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులన్నీ పూర్తిగా కమ్ముకున్నాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. దాదాపుగా పది రోజులుగా ఎండవేడికి అల్లాడిన ప్రజలు, వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సేద తీరారు. మండలంలోని నార్త్ మోపూరు, పల్లిపాలెం, తుఫాన్ నగర్, మందిరం తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.