వినాయక చవితి ఉత్సవాలపై కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను ఎమ్మెల్యే గ్రాండ్ గా చేయమన్నారని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలందరూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వారు గురువారం ఈ వీడియో విడుదల చేశారు.