బోగోలు మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం బోగోలు మండలం పర్యటించారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడితే, పదేళ్లుగా కావలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపుతానన్నారు.