దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు కావలి డిఎస్పి వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏఎస్ పేటకు చెందిన ప్రభాయ్య అనే వ్యక్తిని ఐతంపాడుకు చెందిన మధు అనే వ్యక్తి చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని కోపంతో మరో ఏడు మంది తో కలిసి హత్య చేసినట్లుగా తెలిపారు. 5 గురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.