ఎమ్మిగనూరులో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ
ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ. విజయవాడ వరదల్లో విధులు చేపట్టిన పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కార్మికులకు బట్టలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.