బిస్కెట్ లో ఇనుప తీగ.. వీడియో వైరల్

85பார்த்தது
ఇటీవల ఏదో ఒకచోట తినే ఆహార పదార్థాలలో చనిపోయిన జంతువులు, ఇతర వస్తువులు కనపడటం పరిపాటుగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో చోటు చేసుకుంది. హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి స్థానికంగా ఉండే దుకాణంలో 'BOURBON' బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అందులోని బిస్కెట్ లను పిల్లలు తింటుండగా వాటిలో ఇనుప తీగను గుర్తించారు. దీంతో ఇలాంటి బిస్కెట్స్ తీనొద్దంటూ సూచిస్తూ హనుమాన్ దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி