పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో సామూహిక దాడిలో తీవ్రంగా గాయపడిన గోవిందమ్మను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దేశాయ్ నెట్వర్క్ అధినేత గురురాజ్ దేశాయ్ సోమవారం పరామర్శించారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.