పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగుల వాడకంపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎమ్మిగనూరులో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు మూడు టీమ్లను ఏర్పాటు చేసి పలు దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు చేశారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను స్వాధీనం చేసుకొని వాటిని డంప్ యార్డుకు తరలించారు.