ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడనుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుండి ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నారని, నందవరం మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందించవచ్చని తెలిపారు.