ఎమ్మిగనూరు మండల పరిధిలోని కుర్ని కళ్యాణమండపంలో సోమవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. మండల పరిధిలో ఉన్న సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కొద్ది రోజులుగా గోనెగండ్ల, ఎమ్మిగనూరు పట్టణ ప్రజల వినతులు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నామన్నారు.