దాదాపు 15రోజులుగా కొనసాగిన గోవిందమ్మ దీక్ష బుధవారం విరమించారు. నిన్న ఎస్పీ బిందు మాధవ్ కల్లుకుంట గ్రామాన్ని సందర్శించి బాధితురాలికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికి 26మందిని యాడ్ చేశామన్నారు. మిగతా వాళ్ళను ఆల్టరేషన్ చేయించి అవసరమైతే 164 సెక్షన్ ప్రకారం వారి పేర్లు మేజిస్ట్రేట్ దగ్గర తెలిపితే వాళ్లను కూడా యాడ్ చేయడం ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ హామి మేరకు పోలీసులు, ప్రజా సంఘాల నాయకులు దీక్ష విరమింపజేశారు.