ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వలన బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు విద్య ఉద్యోగాలలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి రఘు రాముడు యాదవ్, కార్యదర్శి బాలస్వామి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మకూరులోని బీసీ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశము ఆదివారం నిర్వహించారు.