ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఉద్యాన అధికారి నాగరాజు తెలిపారు. గురువారం మహానంది మండలంలోని బుక్కాపురం, తిమ్మాపురం, పుట్టుపల్లె గ్రామాల్లోని అరటి పోలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పంట నమోదు ప్రతి ఒక్క రైతు, బాధ్యతగా గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో, నమోదు చేసుకోవాలన్నారు. అరటి పంటను వాతావరణ ఆధారిత భీమా పంటగా నంద్యాల జిల్లాలో మండల యూనిట్ పంటగా ఉందని తెలియజేశారు.