ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పర సహకార సమన్వయంతో మహానంది మండలం అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో మహమ్మద్ దౌలా ఆధ్వర్యంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలు చదివి తినిపించారు.