పత్తికొండ పట్టణం లో గల శ్రీ ఈరన్న స్వామి దేవాలయంలో శుక్రవారం అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున నుండి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి బియ్యం, కంది బేడలు, బెల్లం, మంచి నూనె సమర్పించారు. మధ్యాహ్నం సమయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.