పెద్దకడబూరు మండల పరిధిలోని, రీసర్వే గుర్తించిన తప్పులను గ్రామసభల ద్వారా సరి చేస్తామని మండల తహశీల్దార్ శ్రీనాథ్ శుక్రవారం తెలిపారు. మండలంలో వివిధ గ్రామాల్లో నేటి నుంచి నవంబర్ 12 వరకు గ్రామసభలు నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిపై విచారణ చేసి తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ శ్రీనాథ్ తెలియజేశారు.