అక్రమంగా తరలించి నాటుసార విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద 20 లీటర్ల నాటసారని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు అబ్కారీ సిఐ రామాంజనేయులు తెలియజేశారు. గురువారం నందికొట్కూర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మిడుతూరు మండలము నాగలూటి గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్నారని రాబడిన సమాచారం వరకు అబ్కారీ సిఐ రామాంజనేయులు, ఎస్సై జఫ్రూలా మరియు సిబ్బందితో కలిసి దాడులు చేశారు.