మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గ్రామ దేవత మంచాలమ్మను మహిషాసుర మర్దినీ అలంకారంలో శుక్రవారం దర్శించుకున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు, వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రాలతో అభిషేకం నిర్వహించారు. దేవతను పుష్పాలతో అలంకరించి మంగళారతి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, మంచాలమ్మను దర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఊరేగింపు జరిగింది.