ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 31 రోజుల హుండి లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. ముందుగా శ్రీ మఠం ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ వెంకటేష్ జోషి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 3, 38, 02, 400 రూపాయలు వచ్చిందని తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు.