రాష్ట్ర ప్రభుత్వం 'పల్లె పండుగ' కార్యక్రమంతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దకడబూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.