దేవాలయాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిన వడ్ల శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క రాష్ట్ర ప్రముఖ్ టి. ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు మండలం బి. తాండ్రపాడులో మాట్లాడారు. గ్రామంలో పురాతన శివాలయం పునర్నిర్మాణం జరుగుతుందని, వడ్ల శంకరయ్య అనే వ్యక్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని కూల్చడానికి ప్రయత్నించి, నంది విగ్రహాన్ని కూల్చివేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.