పారిశుద్ధ్య లోపంతో కంపు కొడుతున్న గ్రామాలు

79பார்த்தது
పారిశుద్ధ్య లోపంతో కంపు కొడుతున్న గ్రామాలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలోని పలు గ్రామాలు పారిశుధ్య లోపంతో కంపు కొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో చెత్తాచెదారం కుళ్లిపోయింది. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెలువడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి మురికి కూపాలుగా మారాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బుధవారం ప్రజలు మీడియా ముఖంగా కోరారు.

தொடர்புடைய செய்தி