పశువుల్లో వచ్చే గొంతువాపు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలని పశువైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్ తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలో గల శ్రీరంగాపురంలో పశువుల్లో వచ్చే గొంతు వాపు వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల దూడల నుంచి పశువులకు టీకాలు వేస్తున్నామన్నారు. జూన్ 15 వరకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.