జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో రాజకీయ నేతలు, ప్రజలను ఉద్దేశించి ఆళ్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్ మంగళవారం హెచ్చరించారు. ముగ్గురికి మించి ప్రజలు గుమిగూడరాదని, సోషల్ మీడియాలలో ఏ పార్టీని, నేతలను, కార్య కర్తలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టరాదన్నారు. ఫలితాల రోజున బాణాసంచాలు కాల్చరాదని, సభలు సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఎవరైనా గొడవలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.