ఉమ్మడి కర్నూలు జిల్లా, మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ ఈ నెల 29న ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జరగనుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు వయస్సు ధ్రువీకరణ పత్రంతో వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 100మీ, 800మీ, 5కేమీ వాక్, లాంగ్ జంప్, త్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రోలో మూడింటిలో మాత్రమే పాల్గొనాలన్నారు.