ఆదోనిలో పెరిగిన ట్రాఫిక్.సమస్యలతో వాహనదారులు ప్రయాణికులు నరకం చూస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా తయారైంది. పార్కింగ్ జోన్లు లేక రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేసి గంటల తరబడి షాపింగ్ కు వెళ్తున్నారు. ఈ సమయంలో రోడ్డుపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చిరు వ్యాపారులు రోడ్లపైనే దుకాణాలు పెట్టేశారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.