ఆదోనిలోని 1టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం బైకు దొంగను అరెస్టుచేశారు. డిఎస్పి సోమప్ప ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. నంద్యాలకు చెందిన పులీను అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 23 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ. 21. 53 లక్షల ఉందన్నారు. ఆదోని మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో బైకులు పోయినవారు, సరైన పత్రాలను 1టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలని సిఐ శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.