నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

77பார்த்தது
నెల్లూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం బంగారక్కపాలెంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించడంతో యువతిపై రామకృష్ణ అనే ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. యువతిపై దాడి చేసి తానూ గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువతి, యువకులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி