రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగు తెగి విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగి సుమారు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 56వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ రావు, డివిజన్ జనసేన అధ్యక్షులు వాసు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి బుధవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు