ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయ్యే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. మండలంలోని ఎం.తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగంతో పాటు రికార్డులు, రిపోర్టులను, కాన్పుల వార్డును పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి భగవాన్‌దాస్, సిబ్బంది పాల్గొన్నారు.