పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం అల్లుగుండుకు చెందిన సుందరమ్మ, సుంకన్న దంపతుల చిన్న కుమారుడు సుందరాజ్ 15 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చిన్నతనంలో అప్పులు చేయడంతో తల్లితండ్రులు మందలించారు. దీంతో ఇంట్లోంచి పారిపోయాడని స్థానికులు తెలిపారు. అప్పట్నుంచి అతడి ఆచూకీ కోసం ఎంత వెతికిన దొరకలేదన్నారు. శుక్రవారం 16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు భావోగ్వేదానికి గురయ్యారు.