కర్నూలు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 19 మి. మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వెల్దుర్తిలో 51 మి. మీ, అత్యల్పంగా దేవనకొండలో 3. 8మి.మీ వర్షపాతం నమోదైంది. కృష్ణగిరిలో 49.2, కల్లూరులో 39, కర్నూలు అర్బన్ లో 30. 2, కర్నూలు రూరల్ లో 28, పత్తికొండలో 27, ఓర్వకల్లో 24. 8 మి. మీ ప్రకారం వర్షాలు కురిశాయి.